ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28 వ తేదీ శనివారం ఉదయం 9 గంటల కు ది గెలివిస్ విద్యాలయ పాఠశాల లో నంద్యాల జిల్లా స్థాయి 15 సంవత్సరముల లోపు బాల బాలికలకు వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్.రవికృష్ణ,కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టోర్నమెంట్ డైరెక్టర్ , గెలివి వెంకటేశ్వర విద్యాలయ కరస్పాండెంట్ గెలివి వశిష్ట ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 27 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవాలని,నంద్యాల జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జూలై నెల 12, 13 వ తేదీల్లో వైజాగ్ లో జరగబోవు రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
Leave a Reply