విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతి సందర్భంగా పాత్రికేయుల ఆత్మీయ సమావేశం

నంద్యాల జిల్లా  సాహితీ సుధా ఫౌండేషన్ మరియు విశ్వహిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా మంగళవారం విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ,సమాజ చైతన్యానికి, అభివృద్ధికి పాటుపడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు.నంద్యాల జిల్లా సంఘ్ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శ్రీ రామకృష్ణా డిగ్రీ మరియు పీజీ కళాశాలల అధినేత రామకృష్ణారెడ్డి,శాంతినికేతన్ పాఠశాలల అధినేత సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కర్నూల్ విభాగ్ సహ సంపర్క్ ప్రముఖ్ శ్రీ పరశురాముని రామకృష్ణ ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ విభాగ్ సహ కార్యవాహ రామాంజనేయులు,సరస్వతి శిశుమందిర్ అనంతపురం సంభాగ్ ప్రముఖ్ హిమనాథ్, విభాగ్ ప్రౌఢ ప్రముఖ్ రాంప్రసాద్, సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి,జిల్లా ప్రచార ప్రముఖ్ రవి ,జిల్లా సహ ప్రచార ప్రముఖ్ శ్రీనివాసులు, నగర ప్రచార ప్రముఖ్ చింతలపల్లె వాసు,పాలూరి సుబ్బారావు,నరేంద్రతో పాటు ప్రముఖ పాత్రికేయ మిత్రులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మహర్షి నారదుల వారు ‘కలహ భోజనుడు’ అనే నిందను మోస్తూ కూడా ముల్లోకాలు పర్యటించి విశ్వ కళ్యాణం కోసం కృషి చేశారని తెలిపారు.

పోలీసు సేవలు సమాజానికి ఆదర్శం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

APSRTC లో అప్రెంటిషిప్ కు దరఖాస్తులు
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.