నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆదివారం నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవ సంఘము నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులుగా గురు ప్రసాద్ ఆచారి,అధ్యక్షులుగా సూర్యప్రకాష్ ఆచారి,ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ ఆచారి,ప్రధాన కార్యదర్శిగా సుబ్బాచారి, కోశాధికారిగా వీరభద్రాచారి, మరియు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు

ఈ సందర్భంగా అధ్యక్షులు సూర్యప్రకాశ ఆచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘము అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని వారు తెలిపారు.విశ్వబ్రాహ్మణుల విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.నంద్యాల పట్టణంలోని కాళికాంబ దేవస్థానం కమిటీలో విశ్వబ్రాహ్మణులకు స్థానం కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు.వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం నందు ప్రతినిత్యం అర్చన, అభిషేకములు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఇటీవల పదవీ విరమణ పొందిన ఇంజనీర్ రాజశేఖర్ మరియు పురోహితుడు గురవయ్య ఆచార్యులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు
Arattai