నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహణలో సోమవారం సంఘం కార్యాలయంలో ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకుని, 20 మంది దివ్యాంగులకు లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్ సౌజన్యంతో పదిహేను వేల రూపాయల విలువచేసే నెల వారి మందుల పంపిణీ చేశారు.

నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య పాల్గొని మాట్లాడుతూ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు నెలవారి మందుల పంపిణీ నిరంతరం కొనసాగిస్తామన్నారు.
మందులు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఒక నెల మందులు ఉచితంగా అందిస్తున్న రవి ప్రకాష్ కు ధన్యవాదాలు తెలిపి శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

దాత రవి ప్రకాష్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవలు అందించడం వ్యక్తిగత సామాజిక బాధ్యతగా భావించి సహకరిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య, కార్యాలయ కార్యదర్శులు మధు,వెంకటేశ్వర్లు, సూర్య, దివ్యాంగ లబ్ధిదారులు వారికి తోడుగా వచ్చిన వారు పాల్గొన్నారు.
Leave a Reply