AP-శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో ఘనంగా లక్ష్మీ గణపతి సరస్వతి హోమం

నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో వైభవోపేతంగా లక్ష్మీ గణపతి సరస్వతి హోమాన్ని నిర్వహించారు.

నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఆధ్వర్యంలో హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అధినేత డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, ఆయన కుమారులు,బ్యాంకు కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డి,పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి, బ్యాంక్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు హోమంలో పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నగర డోన సుధీర్ ఆధ్వర్యంలో రుత్వికులు మామిళ్ళపల్లి ప్రభాకర్ శర్మ వారి బృందం చే లక్ష్మీ గణపతి సరస్వతి హోమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

AP-ఎపి సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా లక్ష్మీ గణపతి సరస్వతి హోమాలను నిర్వహించారు. విద్యార్థుల్లో భక్తి భావాన్ని పెంచేలా చేయడం సరస్వతి అమ్మవారి కరుణాకటాక్షాలు విద్యార్థులపై ఉండేలా లక్ష్మీ గణపతి సరస్వతి హోమాలను నిర్వహించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కలగాలని హోమం జరిగింది. హోమంలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రుత్వికులు హోమంలో మంత్రాలను జపించగా మీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అధినేత పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి డైరెక్టర్లు పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డి, పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని హోమాన్ని విజయవంతంగా ముగించారు.

హోమ అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో 4000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాల మురళీకృష్ణ, నవీన్, ప్రభాకర్, ప్రశాంతి, మల్లికా, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు