భాషోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని సంస్థ నంద్యాల జిల్లా అధ్యక్షులు కన్నయ్య పేర్కొన్నారు. నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ హోమ్ లో ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన భాషోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.అలాగే జిల్లా ,రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన భాషోపాధ్యాయులను అభినందించి సత్కరించారు.అతిథులుగా నంద్యాల జిల్లా ఉప విద్యాధికారి శంకర ప్రసాద్ మండల విద్యాధికారి రామసుబ్బయ్య ఉపాధ్యాయ సంఘం నేతలు ముత్తోజు వీరబ్రహ్మం, షరీఫ్,అన్నెం శ్రీనివాసరెడ్డి ఎంఈఓ లు మార్గరెట్ ,సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా శంకర ప్రసాద్ మాట్లాడుతూ భాషోపాధ్యాయులు పాఠశాల సహాయకులుగా పదోన్నతి పొందడంతో పాటు ప్రధానోపాధ్యాయులుగా మండల విద్యాధికారులుగా పదోన్నతి పొంది సమర్థవంతంగా విధులు నిర్వహించడం హర్షనీయమన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించుటలో భాషోధ్యాయుల కృషి కీలకమన్నారు .జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన భాషోపాధ్యాయులను అభినందించారు. జిల్లా అధ్యక్షులు కన్నయ్య మాట్లాడుతూ భాషోపాధ్యాయులు ఉన్నతీకరణకు తమ సంస్థ చేసిన కృషిని వివరించారు. అలాగే డి ఈ ఓ పూల్ భాషా పండిట్ల సమస్య పరిష్కారానికి తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు

కర్నూలు నంద్యాల జిల్లాలకు చెందిన సంస్థ నాయకులు మద్దిలేటి రమణ, యోగేశ్వర్ రెడ్డి, తాహిర్, వెంకటేశ్వర్లు, సలీం, లింగమయ్య విశ్వనాథరెడ్డి, దామోదర్, రబ్బాని, రాము తదితరుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. భాషాపాధ్యాయ సంస్థ సభ్యత్వాన్ని పెంచడానికి కృషి చేసిన ప్రవీణ్, హబీబుల్లా,రామాంజి త్యాగరాజు తదితరులను సంస్థ కార్యవర్గము అభినందించింది. సత్కారం అందుకున్న వారిలో ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, ఖాజాబేగ్ ఉమాదేవి, శిరీష, మార్గరెట్ శ్యామల తదితరులు ఉన్నారు ఇటీవల రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన ఉపాధ్యాయులు శేషఫణి, లక్ష్మయ్య, శ్రీనివాసులు ,హరినాథ్ గౌడ్ తదితరులను సత్కరించారు. మొత్తం 40 మందికి పైగా ఉపాధ్యాయులను తమ సంస్థ సత్కరించినట్లు సంస్థ కార్యదర్శి హుస్సేన్ మియా పేర్కొన్నారు.
Leave a Reply