వీల్ చైర్ అందచేసిన నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం

పక్షవాతంతో మంచానికే పరిమితమైన రామయ్య అనే వృద్ధునికి చక్రాల కుర్చీ అవసరం వున్నదని తెలపడంతో,నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున అతని సోదరుడు లక్ష్మయ్య గురుస్వామికి చక్రాల కుర్చీ అందచేశారు.

నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.పీ.వి. రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నిరుపేద దివ్యాంగులకు సహకారం సంఘం తరపున, లయన్స్ క్లబ్, ఐఎంఏ, మరియు ఇతర దాతల సహకారంతో నిరంతరం కొనసాగిస్తామన్నారు. అవసరమున్న దివ్యాంగులు సంఘం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

AP-ఎపి సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం

ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్యతో పాటు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వెంకటరావు, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ ఎస్ ప్రసాద్, కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు తోట శ్రీనివాస్, రామయ్య, మురళీధర్ పాల్గొన్నారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు