నంద్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజ నిర్మాణ శిల్పులని మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి, కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం హనీఫ్ నగర్ లోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

AP-ఎపి సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం

ఈ సందర్భంగా బోధనా వృత్తి చేపట్టి సుదీర్ఘకాలంగా నంద్యాలలో పలు కళాశాలలో పనిచేస్తూ ఉత్తమసేవలు అందిస్తున్న అధ్యాపకులను సత్కరించారు. అధ్యాపకులు విక్టర్ వినోద్ కుమార్,బాలరాజు,శేషశయనా రెడ్డి, సుబ్రహ్మణ్యం, పుల్లయ్య, మురళి తదితరులను క్లబ్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ,చింతల మోహన్ రావు రోటరీ పాఠశాల కరస్పాండెంట్ డివి సుబ్బయ్య, ప్రసాద్ , మహబూబ్ బాష, అన్నెం శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు