ఉపాధ్యాయ దినోత్సవం(సెప్టెంబర్ 5) సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శేషఫణిని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అభినందించారు.
ఆదివారం రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ ఆధ్వర్యంలో కడప పట్టణం, మద్రాస్ రోడ్డు లోని స్కౌట్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ కార్యక్రమానికి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మహోన్నత బాధ్యత గురువులదేనని తెలిపారు.
ఈ సందర్భంగా అత్యుత్తమ రీతిలో ఆంగ్ల బోధనలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన శేషఫణి ని జ్ఞాపిక శాలువతో సత్కరించి అభినందించారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గునిశెట్టి శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ SM షరీఫ్ అధికార ప్రతినిధి ముత్తోజు వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. సత్కారం పొందిన శేషఫణిని నంద్యాల జిల్లా ఆర్ జె యు పి నాయకులు అన్నెం శ్రీనివాస రెడ్డి, ప్రసాద్, నీలం వెంకటేశ్వర్లు ,ఎస్ ఎల్ టి ఏ నాయకులు కన్నయ్య , హుస్సేన్ మియ తదితరులు అభినందించారు.
AP-ఉత్తమ ఉపాధ్యాయునికి సత్కారం

Leave a Reply