AP-కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం పై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం

నంద్యాల జిల్లా నంద్యాల నందు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గాంధీ నగర్ మీటింగు హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం పై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ చికెన్ గునియా మెదడువాపు, బోదకాలు వంటి వ్యాధులు దోమకాటు వల్ల వస్తుందని,గ్రామ పట్టణ ప్రాంతాల్లో దోమకాటుకు ప్రజలు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి,మరియు జ్వరాలపై అవగాహన కల్పిస్తూ వ్యాధి లక్షణాలపై వారికి తెలియజేయాలని గ్రామాలలో పట్టణలలో దోమలపై అవగాహన కల్పించాలని.దోమలవల్ల కాటు వల్ల జరిగే ప్రాణాహాని గురించి ప్రజలుకు అవగాహన మరియు ప్రతి శుక్రవారం ప్రజలు ఫ్రై డే ,డ్రై డే పై అవగాహన కల్పించాలని తెలియచేశారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

ఈ కార్యక్రమంలో Dr.Nirajan Asst. Professor Medical College, మలేరియా అధికారి సి చంద్రశేఖర్,సహాయ జిల్లా అధికారి కె సత్యనారాయణ,మలేరియా ఆఫీసు సిబ్బంది జిల్లా లోని సబ్ యూనిట్ అధికారులు సూపర్ వైజర్ సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి: మంత్రి సవిత