నంద్యాల సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలు అందించిన నరాల జయ చంద్రారెడ్డి బుధవారం హైదరాబాదులో మృతికి కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తోంది.ఈ సందర్భంగా కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు,డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల సిటీ కేబుల్ కు అనేక సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్ గా జయ చంద్రా రెడ్డి నంద్యాల పట్టణంలో కేబుల్ టీవీ ప్రసారాలు విస్తృత కావడంలో విశేషంగా సేవలు అందించారని గుర్తు చేశారు.

దసరా ,సంక్రాంతి పండుగల సందర్భంలో కేబుల్ టీవీ ఆధ్వర్యంలో, కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం సహకారంతో కళారాధన నిర్వహణలో అనేక సంవత్సరాలు ముగ్గులు, దసరా శక్తి వేషాలు, మహిళలకు ప్రత్యేకమైన శిరోజాలంకరణ, మెహందీ, పుష్పాలంకరణ, వంటల పోటీలు, యువతకు శాస్త్రీయ ఆధునిక నృత్య పోటీలు నిర్వహించి సాంస్కృతిక కళారంగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు.
దసరా శక్తి వేషాలను నంద్యాలలో పునరుద్ధరించి అనేక సంవత్సరాలు నిర్వహించారని, ఇటీవల దసరాకు ముందు కూడా హైదరాబాదులో అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దసరా శక్తి వేషాల పోటీల గురించి ఆసక్తి కనపరిచారని తెలిపారు.వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉన్న వ్యక్తి మృతి తీవ్ర విచారాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కళారాధన తరపున ప్రార్థిస్తున్నామని అన్నారు
Leave a Reply