ప్రజలను పీడీస్తున్న క్యాన్సర్, బోన్ క్యాన్సర్ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచి చైతన్యం కలిగించేందుకు యువ వైద్యుల సాహస ప్రయత్నం గొప్పదని, అందులో ఐదు మంది యువ మహిళా కూడా సైకిల్ తొక్కుతూ పాల్గొనడం అభినందనీయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

బోన్ క్యాన్సర్ నివారణ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి ( కాశీ ) నుంచి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి వరకు 15 మంది యువ వైద్యులు, అందులో 5 మంది యువ మహిళా వైద్యులు సాహస సైకిల్ యాత్ర చేస్తూ బోన్ క్యాన్సర్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గురువారం కర్నూలు నగరంకు చేరుకున్నారు.నేటికీ సుమారు 3 వేల కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ కర్నూలు టోల్ ఫ్లాజా వద్దకు చేరుకోగానే నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి సాహస వైద్య బృందంకు ఘన స్వాగతం పలికారు.
కర్నూలు జిల్లాలో అత్యధిక క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ బి పి, షుగర్ కన్నా క్యాన్సర్ వ్యాధి ప్రజలను పీడీస్తుందని, కర్నూలు జిల్లాలో అత్యధిక క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు ఉండడం ఆందోళన కలిగిస్తుందని, ప్రతి కుటుంబంలో ఒకరు క్యాన్సర్ జబ్బుతో భాద పడుతున్నారని, కలుషిత ఆహరం, వాతావరణంలో మార్పుల వల్ల క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయని, ముందు శరీరంను పరీక్షించి వ్యాధి లక్ష్యణాలు కనబడితే వెంటనే డాక్టర్ వద్ద చికిత్స చేయించుకోవాలనీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సూచనలు చేశారు.

కాన్సర్, బోన్ క్యాన్సర్ వ్యాధి నుంచి ప్రజలు మీకు మీరే కాపాడుకోవాలని, ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం సద్వినియోగం చేసుకోవాలని, ముందుగా గుర్తిస్తే వ్యాధి పెరగకుండా అదుపు చేసుకోవచ్చని, వ్యాధిని నివారించుకోవచ్చని, దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్యులు సాహస సైకిల్ యాత్ర చేయడం గొప్ప విషయం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు
కాశీ నుంచి కన్యాకుమారి వరకు సాహస సైకిల్ యాత్ర చేస్తున్న 15 మంది వైద్య బృందం, వారి సహాయకులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కర్నూలులోని ఆమె ఇంట్లో గురువారం రాత్రి బస ఏర్పాటు చేశారు.కర్నూలు టోల్ ఫ్లాజా వద్ద వైద్య బృందంకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు కర్నూలు డీ ఎస్ పి మహబూబ్ బాషా, టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి, వేముల శ్రీధర్ శెట్టి, రాయలసీమ ఉద్యమ నాయకులు సీమ కృష్ణ, నాగభూషణం, గణేష్, కిషోర్ తదితరులు స్వాగతం పలికి కన్యాకుమారి వరకు మీ సాహస యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇంటి వరకు వారి వెంట వచ్చారు.
Leave a Reply