AP-నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ బాలిక దినోత్సవం

శనివారం ప్రపంచ బాలికా దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, మహానంది మార్గంలో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ బాలికల చాత్రాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీస్ చైర్మన్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో 50 మంది బాలికలకు నిత్యావసర కిట్లను పంపిణీ చేయడం జరిగింది

ఈ సందర్భంగా ఆత్మకూరు సుదర్శనం శెట్టి మాట్లాడుతూ కుటుంబంలో బాలికలే కీలక పాత్ర వహిస్తున్నారని,అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు.

యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి

చాత్రాలయ బాలికలకు సహకారం అందిస్తామన్నారు. డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ బాలికలను విద్యారంగంలో అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాలు,సామాజిక సేవా సంస్థలు బాలికలను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాయని ఆ అవకాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సుదర్శనం శెట్టి, డాక్టర్ సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, ఆత్మకూరు రవికుమార్,లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్,కోశాధికారి అమిదేల జనార్ధన్,చాత్రాలయ నిర్వాహకులు మోక్షేశ్వరుడు , చాత్రాలయ బాలికలు పాల్గొన్నారు.