ఈ నెల 13న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: జిల్లా కలెక్టర్ రాజకుమారి

ఈ నెల 13న (సోమవారం) నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు.

అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోనూ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని ఆమె చెప్పారు.

యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి

అర్జీదారులు మొదట తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయంలోని అధికారులకు అర్జీలు ఇవ్వాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలు మాత్రమే జిల్లా కేంద్రంలోని వేదికకు రావలసిందిగా కలెక్టర్ సూచించారు.

అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు.

సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష