AP-విజయవాడలో రోడ్ సేఫ్టీపై హోం మంత్రి అనిత సమీక్ష

విజయవాడ, అక్టోబర్ 13: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్ సేఫ్టీ ఏడీజీ కృపానంద త్రిపాఠి (ఐపిఎస్), డీఐజీ విజయరావు (ఐపిఎస్), మల్లికా గార్గ్ (ఐపిఎస్ – టెక్నికల్ సర్వీసెస్)తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న ట్రాఫిక్ చలానా సిస్టమ్, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

AP-ఎపి సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం

ట్రాఫిక్ నియంత్రణ మరియు నిర్వహణ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై హోం మంత్రి అధికారులకు పలు సూచినలు చేశారు.


రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి, ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు