నంద్యాల, అక్టోబర్ 13: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంతృప్తి స్థాయిలో వేగవంతంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును జవాబుదారీతనంతో పరిష్కరించాలన్నారు. పి జి ఆర్ ఎస్ అర్జీలతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్జీలు క్లియర్ చేయాలన్నారు.
ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు.
- నంద్యాల జిల్లా, డోన్ మండలం, డోన్ గ్రామానికి చెందిన రమీజా నాకు ముగ్గురు పిల్లలు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనుచున్నారు. తల్లికి వందనం పథకం కింద నా అకౌంట్ కు డబ్బులు జమ కాలేదు దయచేసి నాకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని డిఆర్ఓకు అర్జీ సమర్పించారు.
- నంద్యాల మండలం, కందికాయపల్లి గ్రామానికి చెందిన పి .వెంకటసుబ్బయ్య తనకు ముగ్గురు కుమారులు ఉన్నారు ముగ్గురికి వివాహం అయింది. వీరిని రేషన్ కార్డు నుంచి డివైడ్ చేసి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయదరని డిఆర్ఓ కు అర్జీ సమర్పించారు.
- నంద్యాల మండలం, అంబులదిన్నె గ్రామానికి చెందిన ఎల్ బాల పోలయ్య, హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు అయిందని ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లులు మంజూరు కాలేదని డిఆర్ఓకు అర్జీ సమర్పించారు.
- రుద్రవరం మండలం, పెద్దకంబలూరు గ్రామానికి చెందిన కె .నారాయణరెడ్డి తనకు రేషన్ కార్డు మంజూరు చేయాలని డి ఆర్ ఓ కు అర్జీ సమర్పించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో 188 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా రెవెన్యూ అధికారికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Leave a Reply