NANDYAL Oct13:-నంద్యాల పట్టణంలోని ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.సాయంత్రం స్వామివారికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు.

గత నాలుగు సంవత్సరాలుగా,ప్రతి సోమవారం స్వామి వారికి పల్లకి సేవను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.చలం బాబు,అర్చకులు ప్రవీణ్ స్వామి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Arattai