NANDYAL Oct 15:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల PSC & KVSC స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈనెల 20 నుంచి పైతాన్ మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు ఉచిత శిక్షణ కార్యక్రమం మొదలవుతాయని కళాశాల ప్రిన్సిపల్ శశికళ గారు తెలియజేశారు.
పైతాన్ కోర్సుకు డిగ్రీ లేదా బీటెక్ లో కంప్యూటర్ చదివిన వారు మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఇంటర్ లేదా ఆపై చదివిన యువతి యువకులు అర్హులని, కోర్సు పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపుతో కుడిన సర్టిఫికేట్ ఇస్తామని, శిక్షణ అనంతరం ఆయా కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు. శిక్షణకి అర్హులైన యువతి యువకులు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
శిక్షణకు హాజరయ్యే అభ్యర్ధులు వారి విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, రెండు ఫోటోలతో హాజరు కాగలరని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 8297812530 అనే నెంబర్ ను సంప్రదించాలని కోరారు
Leave a Reply