NANDYAL Oct 16:- గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్.ఆర్.బి.సి. కాలనీ సమీపంలో ఉన్న లైఫ్ పరివర్తన హెచ్ఐవి బాలల కేంద్రానికి, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపోయే ఆహార సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా దాత ఆత్మకూరు సుదర్శనం శెట్టి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆహారం దొరకదు అన్న పరిస్థితి పూర్తిగా పోవాలని, ఆహారం వృధా చేయరాదనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని, ప్రజలకు సరిపడా ఆహార ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి సాధించే దశకు ప్రపంచమంతా చేరుకోవాలన్నదే ప్రపంచ ఆహార దినోత్సవం ప్రధాన ఆశయం అన్నారు.

పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులు అబ్రహం కుటుంబం హెచ్ఐవి బాలల సంరక్షణ కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ సహదేవుడు, ఆత్మకూరు సుదర్శనం శెట్టి లతొ పాటు,నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, ఏ.ఎన్.సీ ఆగ్రోస్ నిర్వాహకులు ఆత్మకూరు రవి, లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, లైఫ్ పరివర్తన కేంద్రం నిర్వాహకులు అబ్రహం లింకన్, కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న హెచ్ఐవి బాలలు పాల్గొన్నారు.
Leave a Reply