విశాఖలో నవంబరు 14,15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు పై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు
హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు
వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరైన సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు
ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమావేశంలో చర్చ
భాగస్వామ్య సదస్సుపై ఇప్పటికే దేశ విదేశాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం

విశాఖ పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికిన సీఎ చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీమేకర్లను కూడా ఆహ్వానించాలన్న సిఎం
కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జి షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు సదస్సును వేదిక చేయాలన్న సిఎం చంద్రబాబు
ప్రపంచంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని అవకాశాలు సృష్టించేందుకు ఉపయోగపడేలా సదస్సు నిర్వహణ ఉండాలన్న సిఎం
Leave a Reply