నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో, నంద్యాల లయన్స్ క్లబ్,
ఎన్.ఆర్.జి.చెస్ అకాడమీ సంయుక్త నిర్వహణలో నవంబర్ రెండవ తేదీ ఆదివారం స్థానిక టేక్కే లో ఉన్న ఈ.ఎస్.సి .ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో జింకా డ్రాయింగ్ హాల్ నందు నంద్యాల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తున్నారు.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో వివిధ వయస్సు కేటగిరీలలో పన్నెండు వేల రూపాయల నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలను అందజేయడం జరుగుతుందని జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. రవి కృష్ణ,టోర్నమెంట్ డైరెక్టర్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్. శైలేంద్ర కుమార్,ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ గౌరవ అధ్యక్షులు రాజేష్, నంద్యాల జిల్లా సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టోర్నమెంట్ పర్యవేక్షకులు వెంకట్రావు లు తెలిపారు.
ఈనెల 30వ తేదీ లోపు ఆసక్తి గల క్రీడాకారులు ఎంట్రీలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలు నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ 9010451585 లో తెలుసుకోవచ్చు.
Leave a Reply