NANDYAL Oct :- రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, విజయవాడ వారి ఆదేశాల ప్రకారము జిల్లా కలెక్టరు & చైర్మన్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారి ఉత్తర్వుల మేరకు 29-10-2025 మరియు 30-10-2025వ తేదిలలో జిల్లాలోని అఖిల భారత ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు స్త్రీ మరియు పురుషులకు 19 క్రీడాంశాల్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎం.ఎన్.వి రాజు తెలిపారు.
1,హాకీ, 2. కబడ్డి, 3. టెన్నిస్, 4. పవర్ లిఫ్టింగ్ & వెయిట్ లిఫ్టింగ్, 5. టేబుల్ టెన్నిస్, 6. వాలీ బాల్, 7. యోగ, 8. రెస్లింగ్, 09. మ్యూజిక్, డాన్స్ & షార్ట్ ప్లే పోటీలు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నందు నిర్వహిస్తున్నామని తెలిపారు
1.అథ్లెటిక్స్, 2. బ్యాడ్మింటన్, 3.బాస్కెట్ బాల్, 4. క్యారమ్స్ 5. చెస్, 6. క్రికెట్, 7.ఫుట్ బాల్, 8.ఖో-ఖో, 9.బెస్ట్ ఫిజిక్ ,పోటీలు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నందు నిర్వహిస్తున్నామని తెలిపారు
స్విమ్మింగ్ పోటీలు కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నందు నిర్వహిస్తున్నామని తెలిపారు
📖 Also Available as Web Story
Experience this content as an engaging Web Story - perfect for mobile reading!
🎬 View Web Story


Arattai



Leave a Reply