నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు రికార్డు అసిస్టెంట్ గా పనిచేసిన ప్రసాదరావు 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని శుక్రవారం పదవీ విరమణ పొందారు.కళాశాల ప్రిన్సిపాల్ శశికళ ఆధ్వర్యంలో ప్రసాదరావుకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అంకితభావానికి,సమయపాలనకు ప్రసాదరావు నిదర్శనమని కొనియాడారు.పదవి విరమణ అయిన తరువాత వారి యొక్క జీవితం ఆయురారోగ్యలతో సంతోషంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శశికళ, వైస్ ప్రిన్సిపల్ శైలజ రాణి ,కళాశాల ఆఫీసు సూపరిండెంట్ వీ నర్సింహులు అధ్యాపక,అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
Arattai