అధ్యక్షురాలుగా డాక్టర్ మాధవి
కార్యదర్శులు గా డాక్టర్ సునీత,డాక్టర్ శైల
నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు.250 మంది మహిళా వైద్యులు నంద్యాల ఐఎంఏ లో ఉన్నారు.
రెండు సంవత్సరాల పదవీ కాలానికి 38 మంది తో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని సీనియర్
మహిళా వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ,డాక్టర్ లక్ష్మీ సౌజన్య పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు.
ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం నూతన అధ్యక్షురాలు గా మధు చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వాహకురాలు,సీనియర్ అనస్తిషియా వైద్య నిపుణులు డాక్టర్ మాధవి ఎంపికయ్యారు.
డాక్టర్ పెసల సునీత, డాక్టర్ శైలజ కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డారు.

కోశాధికారిగా డాక్టర్ హరిత,ఉపాధ్యక్షులుగా డాక్టర్ నాగ రేఖ,డాక్టర్ ధనలక్ష్మి, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ శశికిరణ్, డాక్టర్ నెట్ల శిల్ప, డాక్టర్ సింధుశ్రీ ,డాక్టర్ గీతావాణి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా డాక్టర్ వేమిరెడ్డి రాధిక, డాక్టర్ రజని, డాక్టర్ తనూజ, డాక్టర్ దివ్య తేజ, సహా కోశాధికారులుగా డాక్టర్ లలిత, డాక్టర్ మల్లీశ్వరి ఎంపిక కాగా,కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ సునీత,డాక్టర్ అనూష హేమంత్, డాక్టర్ కీర్తి, డాక్టర్ అనిత, డాక్టర్ భారతి, డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ వకుల క్రాంతి, డాక్టర్ మధు ప్రీతి, డాక్టర్ స్ఫూర్తి, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ అనూష గింజుపల్లి, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ అనుప్రియ, డాక్టర్ శివజ్యోతి, డాక్టర్ చరిష్మా లు ఎన్నికయ్యారు.

ఐఎంఏ రాష్ట్ర విభాగం లో ఉన్న డాక్టర్ వసుధ, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, గతంలో నంద్యాల ఐఎంఏ మహిళా విభాగానికి నాయకత్వం వహించిన డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పన, డాక్టర్ అరుణ కుమారిలు ప్రత్యేక ఆహ్వానితులుగా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు.

నూతన నంద్యాల ఐఎంఏ మహిళా విభాగానికి ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి ,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ అనిల్ కుమార్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత,డాక్టర్ శైలజ లు మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాలలో వైద్య శిబిరాలు, విద్యాసంస్థలలో బాలికలకు ఆరోగ్య అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందని అన్నారు. నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం తో కలిసి సంయుక్తంగా వైద్యులకు ఆధునిక ఆవిష్కరణలపై నిరంతర వైద్య విద్య సదస్సులు నిర్వహిస్తామన్నారు.
Arattai