శనివారం ప్రధమానందీశ్వర స్వామి దేవస్థానం నందు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుమేశుల నాగరాజు,కార్యదర్శి తాతి రెడ్డి భాస్కర్ రెడ్డి,కోశాధికారి అమిదల జనార్ధన్ లు పాల్గొని ప్రారంభించారు.దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.

దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు చలం బాబు మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి రోజు నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయ అభివృద్ధి కోసం భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
Arattai