నంద్యాల ఐఎంఏ ఇటీవల నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో నంద్యాల ఐఎంఏ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ లో 500 మంది వైద్యులు పట్టణంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, సామాజిక సేవలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు సేవ చేస్తున్నారని అభినందించారు. నూతన కార్యవర్గం కూడా భవిష్యత్తులో మంచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ఈ సందర్భంగా నంద్యాల ఐఎంఏ గత సంవత్సరం చేసిన కార్యక్రమాలకు రాష్ట్రంలో ఉత్తమ శాఖ పురస్కారం, ఉత్తమ మహిళా వైద్య విభాగ సామాజిక సేవా పురస్కారం తో పాటు డాక్టర్ మధుసూదనరావుకు ఉత్తమ అధ్యక్షుడు పురస్కారం ప్రకటించారని 22వ తేదీ రాజంపేటలో జరిగే రాష్ట్రస్థాయి ఐఎంఎ సదస్సులో ఈ పురస్కారాలు అందిస్తారని మంత్రికి వివరించారు. ఐఎంఏ నాయకులు మంత్రి ఫరూక్ ను శాలువా గజమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్ ,ఐఎంఏ నంద్యాల నూతన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి , కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు, నంద్యాల ఐఎంఏ అకాడమిక్ విభాగం కార్యదర్శి డాక్టర్ లలిత, మిషన్ పింక్ హెల్త్ సమన్వయకర్త డాక్టర్ ఆరిఫా భాను పాల్గొన్నారు.
Arattai