నంద్యాల పట్టణం ఎస్పీజీ హై స్కూల్ క్రీడా మైదానం నందు శనివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని హోలీ క్రాస్ కేథడ్రల్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు.

ఈ పోటీలను బిషప్ రెవరెండ్.సంతోష్ ప్రసన్న ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడాలని, గెలుపు ఓటములు దైవాదినం కాబట్టి పోరాటపటిమను ప్రదర్శించి జయాపజయాలను సమానంగా స్వీకరించాలని బిషప్ సంతోష్ ప్రసన్న తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంకా సెక్రెటరీ శ్రీ బి ప్రభుదాస్, ట్రెజరర్ నందం ఐజక్ బాబు, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ. ఎం స్టీఫెన్, రెవరెండ్ జోసఫ్ బాబు , కన్వీనర్లు వి సురేష్ పాల్, జడ్. రిచర్డ్స్ మరియు, గురువుల బృందం పాల్గొన్నారు
Arattai