దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఫరూక్.
1000 మంది దివ్యాంగులకు నూతన దుస్తుల పంపిణీ
కుట్టు మిషన్లు,చక్రాల కుర్చీలు,వినికిడి యంత్రాలు, చంక కర్రల పంపిణీ.
దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు
ప్రత్యేక పాఠశాలల బాలలకు 300 నిత్యావసర వస్తువుల కిట్ల పంపిణీ
దీర్ఘకాలిక జబ్బుల దివ్యాంగులకు నెలవారీ మందులు, ఐఎంఏ ఉచిత ఆరోగ్య కార్డులు పంపిణీ
సహకారం అందజేసిన ఐఎంఏ నంద్యాల వైద్యులు, లయన్స్ క్లబ్ నంద్యాల సభ్యులు, పట్టణ ప్రముఖులు
NANDYAL Dec 03:-బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని, స్థానిక ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్ నందు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల,లయన్స్ క్లబ్ నంద్యాల సహకారంతో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్యల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది దివ్యాంగులు నంద్యాల జిల్లా పలు ప్రాంతాల నుండి ఉత్సాహంతో వచ్చి పాల్గొన్నారు.

ఐదు లక్షల రూపాయల విలువ చేసే సేవా కార్యక్రమాలు:
1000 మందికి నూతన దుస్తుల,ఆరు కుట్టు మిషన్లు, 5 చక్రాల కుర్చీలు,5 వినికిడి యంత్రాలు,10 మందికి చంక కర్రలు, 11 మంది దివ్యాంగ విద్యార్థులకు 1500 చొప్పున ఉపకార వేతనాలు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న 20 మంది దివ్యాంగులకు 20వేల రూపాయల విలువ చేసే నెలవారి మందులు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆరు ప్రత్యేక పాఠశాలల బాలలకు 300 నిత్యావసర వస్తువుల కిట్లు , ఐఎంఏ ఉచిత ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వంలోకి రాగానే 3000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ 6000కు పెంచడం జరిగిందన్నారు.

ప్రభుత్వ నిధులు అన్ని స్థాయిలలో ఐదు శాతం నిధులు దివ్యాంగుల సంక్షేమానికి ఖర్చు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ద్వారా డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య దివ్యాంగుల కోసం పాతిక సంవత్సరాలుగా చేస్తున్న కృషి విశిష్టమైనదని ప్రశంసించారు. దివ్యాంగులకు ఇండ్లు ఇళ్ల స్థలాల కేటాయింపులో వారికి ప్రత్యేక కేటాయింపు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్,రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గోపాలకృష్ణ, వైస్ గవర్నర్ విరూపాక్ష రెడ్డి, మాజీ ఆంధ్ర ప్రదేశ్ లయన్స్ చైర్మన్ ఏవిఆర్ ప్రసాద్,ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు, అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్,జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాశి నాగ మహేష్,ప్రముఖ వైద్యులు సహదేవుడు, లక్ష్మీ సౌజన్య, నాగమణి,మాధవి, వసుధ, అరిఫా భాను,
అరుణకుమారి,డాక్టర్ రవి కృష్ణ సతీమణి సునంద పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ దివ్యాంగుల సేవ విశ్వ మానవ సేవగా భావించాలని, మానవసేవే మాధవ సేవ అని , దివ్యాంగుల పట్ల జాలి పడడం కాకుండా వారు ఆత్మవిశ్వాసంతో స్వశక్తితో పైకి రావడానికి సమాజం తన వంతు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగులు నిరుత్సాహపడకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని కోరారు.

నంద్యాల జిల్లా దివ్యాంగుల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య మాట్లాడుతూ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం 365 రోజులు దివ్యాంగులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడమే కాకుండా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పర్యటన సందర్భంగా పలు ఉపకరణాలు అందజేస్తున్నామని, ప్రతినెలా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.ప్రభుత్వం ద్వారా అందవలసిన సహాయ సహకారాలు అందుకోవడానికి అవసరమైన సలహాలు సూచనలు కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
సేవా కార్యక్రమాలకుసహకరించిన దాతలు:
డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, డాక్టర్ మధుసూదనరావు, వెదుర్ల రామచంద్రరావు,డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ కల్పన, డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి,భవనాసి వాసు, నాగ మహేష్ ,డాక్టర్ పనీల్, వర్ధన్ శెట్టి రాజారాం, డాక్టర్ నర్మద, లాలి స్వామి, తోట శ్రీనివాస్ ,రామన్న, పోసిన సుబ్బారావు, రవి ప్రకాష్, సిరిగిరి రమేష్, డాక్టర్ తారకేశ్వర్ రెడ్డి, డాక్టర్ వినోద్, వెంకటేశ్వర్లు, డాక్టర్ అనిల్ కుమార్ ,డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, మహేశ్వరరెడ్డి ,డాక్టర్ విజయబాబు, డాక్టర్ పాండురంగారావు, కసెట్టి చంద్రశేఖర్ , కసెట్టి వేణుమాధవ్ ,శ్రీకాంత్, డాక్టర్ హరినాథ్ రెడ్డి ,పబ్బు తులసి కృష్ణ, డాక్టర్ భార్గవరెడ్డి , సిసింద్రీ ఆసుపత్రి డాక్టర్ మధుసూదన్ రెడ్డి ,డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, ఉదయానందా ఆసుపత్రి డాక్టర్ భార్గవరెడ్డి, కృష్ణమోహన్, మలేపాటి రాజశేఖర్, స్వామి రెడ్డి ,డాక్టర్ సోమశేఖర్ రెడ్డి ,డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ పెసల అశోక్ కుమార్, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ మహమ్మద్ రఫీ.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, అధ్యక్షులు సోమేశులు నాగరాజు , కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్,దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి ,వెంకటరావు, కార్యాలయ కార్యదర్శి ఆలా మధు,రామకృష్ణ,వెంకటరావు , హనీఫ్ ఖాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్ సి సి క్యాడేట్ల ప్రశంసనీయమైన సేవలు
కార్యక్రమ నిర్వహణలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్ సి సి క్యాడేట్ల సేవలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి.
మధ్యాహ్న భోజన వితరణ
ఓంకార క్షేత్రంలోని శ్రీ కాశి నాయన ఆశ్రమం తరపున దివ్యాంగులకు భోజన వసతి కల్పించారు.

ఆత్మీయ సత్కారాలు:
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, దాతలకు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున శాలువా జ్ఞాపికలతో ఆత్మీయ సత్కారం అందజేశారు.
Arattai