NANDYAL :-నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన జానాల చెంచుగూడెంలో ఆదివారం బాల దంత వైద్యశాల నిర్వాహకులు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ వైద్య శిబిరానికి పరిసర గ్రామాలైన బలపాలతిప్ప, కపిలేశ్వరం,సిద్దేశ్వరం గ్రామాల నుండి ప్రజలు హాజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.దంత సమస్యల గురించి అవగాహన కల్పించి ఉచితంగా మందులను అందజేసినట్లు డాక్టర్ సంతోష్ డాక్టర్ అనుషా తెలిపారు

ఈ శిబిరంలో 47 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో 16 మందికి పుచ్చిపోయిన పండ్లను క్లీన్ చేసి సిమెంట్ పట్టీలు వేసినట్లు వారు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి సహకరించిన రాంప్రసాద్ సుధాకర్ రమేష్ గాంధీ లకు ధన్యవాదాలు తెలిపారు

Arattai