నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో ఎన్. కొత్తపల్లె గ్రామంలో ఉన్న శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ సౌజన్య మంచి అలవాట్ల గురించి, డాక్టర్ గింజుపల్లి అనూష ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల గురించి, మంచి స్పర్శ, చెడుస్పర్శ ల పై డాక్టర్ తనూజ, విద్యార్థులపై మొబైల్, సోషల్ మీడియా ప్రభావం అన్న అంశంపై డాక్టర్ శశి కిరణ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ద్వారా విద్యా సంస్థలలో వైద్య శిబిరాలు, వివిధ అంశాలపై అవగాహన సదస్సులు సంవత్సరం పొడవునా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఈ కార్యక్రమాలలో నంద్యాల ఐఎంఏ మహిళా వైద్యులు సహకారం అందజేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులతో పాటు పాఠశాల ప్రధానాచార్యులు శ్రీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai