ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ ను కలుపుతూ నంద్యాల నుంచి కర్నూలుకు (బేతంచెర్ల- దుపాడు మధ్య) కొత్త రైలు మార్గం త్వరగా చేపట్టండి సార్
పార్లమెంట్ లో నంద్యాల రైల్వే సమస్యలపై గళ్లమెత్తిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.
NEW DELHI :- నంద్యాల నుంచి గుంతకల్లుకు పగటి పూట రైళ్లు నడపాలనీ, నంద్యాల నుంచి వయా బేతంచెర్ల మీదుగా ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ ను కలుపుతూ కర్నూలు (దుపాడు) వరకు కొత్త రైలు మార్గం వేయాలని బుధవారం పార్లమెంట్ లో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి గలమెత్తారు.
నంద్యాల నుండి గుంతకల్లు వైపు నాలుగు రైళ్లు ఉన్నాయనీ, ఆ నాలుగు రైళ్లు చాలా విచిత్రమైన సమయాల్లో ప్రయాణిస్తాయనీ, అన్ని రైళ్లు అర్ధరాత్రి 12:55, 1:30, 2:20, రాత్రి 8:20కి ఒక రైలు ఉందనీ, కాబట్టి రోజువారీ రైలు ప్రయాణికులు, విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేవారు రైలులో ప్రయాణించే వేలాది మంది ఉన్నారనీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి దయచేసి ఈ మార్గానికి చాలా ఉపయోగకరంగా ఉండే రోజువారీ పగటిపూట మెమో రైలు లేదా ప్రయాణీకుల రైలును అందించమని అభ్యర్థిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ ను కోరారు.
పార్లమెంట్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ సమాధానం ఇస్తూ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అడిగిన నంద్యాల, గుంతకల్లు మధ్య ఎంపీ శబరి నియోజకవర్గంలో పగటిపూట రైలు లేకపోవడం గురించి ఒక నిజమైన సమస్యను లేవనెత్తారనీ, నేను ఇది పరిశీలించాను. నంద్యాలలోని నిర్వహణ సౌకర్యాలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఉన్నాయని, గుంతకల్లులో ICF కోచ్ ల కోసం కొంత నిర్వహణ సౌకర్యం ఉందని, కానీ నంద్యాలలో నిర్వహణ సౌకర్యం లేదని. కాబట్టి, కొంత పరిష్కారాన్ని కనుగొనమని, ఈ సమస్యను పరిష్కరించే మార్గాన్ని కనుగొనమని నేను రైల్వే నిపుణులు బృందాన్ని కోరాననీ, ఇక్కడ. నేను ఫీల్డ్ అధికారులతో కూడా త్వరలో వివరంగా చర్చిస్తానని, వీలైనంత త్వరలో పరిష్కారం కనుగొనబడిన వెంటనే, నేను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి తెలియజేస్తానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారు.
అలాగే నంద్యాల నుంచి కర్నూలు కు కొత్త రైలు మార్గం ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్ లో రెండవ ప్రశ్నగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు.
ప్రస్తుతం నంద్యాల నుండి డోన్ మీదుగా కర్నూలుకు రైలు మార్గం దాదాపు 130 కిలోమీటర్ల దూరం ఉందని, నంద్యాల నుండి వయా బేతంచెర్ల మీదగా ఓర్వకల్లు పారిశ్రామిక హాబ్ ను కలుపుతూ (దుపాడు ) కర్నూలు వరకు కొత్త రైలు మార్గం నిర్మిస్తే 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, ఈ కొత్త రైలుకు 2023 లోనే డి పి ఆర్ నమోదు చేసి, వాస్తవానికి మంజూరు దశలో ఉందని, ఈ సమస్య పరిష్కారం చేసి కొత్త రైలు మార్గం వేయాలని పార్లమెంట్ లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్టవ్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్లును పారిశ్రామిక హాబ్ గా ప్రకటించి అవసరమైన నిధులు, భూమి కేటాయించిందని, కాబట్టి, డీపీఆర్ కు నిధుల కేటాయింపు చేసి నంద్యాల నుంచి వయా బేతంచెర్ల మీదుగా కర్నూలుకు కొత్త రైలు మార్గం పూర్తి చేయాలని పార్లమెంట్ లో కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెచ్చారు.
Arattai