ద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక లైఫ్ పరివర్తన సెంటర్ లో ఉన్న హెచ్ఐవి బాలలు 30 మందికి నూతన దుస్తులు పంపిణీ చేశారు.
నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు బాబురావు సౌజన్యంతో బాలలు ఎంపిక చేసుకున్న దుస్తులను లైఫ్ పరివర్తన సెంటర్ నిర్వాహకులు అబ్రహం లింకన్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ రవి కృష్ణ, బాబురావు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా లైఫ్ పరివర్తన సెంటర్ హెచ్ఐవి బాలలకు నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున సహకారం అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. అబ్రహం లింకన్ నంద్యాల లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ తోపాటు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,కోశాధికారి అమిదేల జనార్ధన్, దాత బాబురావు,లయన్స్ క్లబ్ సభ్యులు కన్నయ్య, మేడం చంద్రశేఖర్, సెంటర్ నిర్వాహకులు అబ్రహం లింకన్, బాలలు పాల్గొన్నారు.
Arattai