మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి వేడుకలను నంద్యాల పట్టణంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి,ఘన నివాళులర్పించారు.
వాజ్పేయి సుపరిపాలన,దేశాభివృద్ధి,బలమైన భారత నిర్మాణంలో ఎంతో కృషి చేశారని వారు తెలిపారు.భారతదేశంలో ఈ రోజును జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు.
భారతదేశంలో జాతీయ రహదారులు ఏర్పాటుకు మూల వ్యక్తి అటల్ జి అని, టెక్నాలజీ పరంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోను ఉందంటే దానికి మూల కారకులు అటల్ జి అని, కాశ్మిర్ నుంచి పాకిస్తాన్ లాహోర్ కు బస్సు ను ఏర్పాటు చేసి ప్రారంభించిన ఏకైక వ్యక్తి అటల్ జి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కశెట్టి చంద్రశేఖర్,సీనియర్ నాయకులు వంకదార గోపాలకృష్ణమూర్తి ,జిల్లా ఉపాధ్యక్షులు పసపుల రవీంద్ర,మురళి చౌదరి,చాందిని, మైనార్టీ నాయకులు మహబూబ్ బాషా,జిల్లా కార్యదర్శి కూరాకు భరత్, హేమంత్, వెంకటేశ్వర్లు, స్వామిరెడ్డి, గాండ్ల ఈశ్వర్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి,కొమ్ము శ్రీహరి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి,వాణి తదితరులు పాల్గొన్నారు
Arattai