NANDYAL:- నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాల నందు రాయలసీమ యూనివర్సిటీ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ పోటీల యందు ఉమ్మడి కర్నూలు జిల్లా యందు ఉన్నటువంటి 17 కళాశాలలు పాల్గొనడం జరిగింది ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అయినటువంటి వి వెంకట బసవరావు అలాగే రిజిస్టర్ బి విజయ్ కుమార్ నాయుడు గారు అలాగే స్పోర్ట్స్ బోర్డ్స్ సెక్రటరీ కె వి శివ కిషోర్ గారు అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గారు అలాగే ఆర్గనైజింగ్ సెక్రెటరీ కే శ్రీనివాసులు మరియు అధ్యాపక అధ్యాపకేత్ర బృందం పాల్గొనడం జరిగింది

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ క్రీడలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ప్రిన్సిపల్ గారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అలాగే ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కె.వి శివ కిషోర్ మాట్లాడుతూ కళాశాల క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వడము ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విద్యార్థులు క్రీడలను ప్రొఫెషనల్‌గా క్రీడలు ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా వారి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ముఖ్యఅతిథి రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వి వెంకట బసవరావు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడము ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ఓడిన వారు నెక్స్ట్ మరలా విజయం సాధించడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించితెలిపారు.

క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా రిజిస్టార్ విజయ్ కుమార్ నాయుడు తెలియజేశారు .అనంతరం క్రీడలలో విజయం సాధించినటువంటి విద్యార్థినీ విద్యార్థులకు మెడల్స్ ను బహూకరించడం జరిగింది. పురుషుల 100 మీటర్ల యందు జోసెఫ్ (శ్రీ లక్ష్మీ బి పి డి కాలేజ్) మొదటి స్థానాన్ని అలాగే మంజునాథ్ ఉస్మానియా డిగ్రీ కాలేజ్ దీవెన్ కుమార్ మూడో స్థానాన్ని సాధించారు. 200 మీటర్ల యందు మహేష్ సెయింట్ జోసెఫ్ మొదటి స్థానాన్ని జోసఫ్ ఉస్మానియా యూనివర్సిటీ రెండవ స్థానాన్ని అలాగే జీవన్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.400 మీటర్ల యందు రాముడు ఉస్మానియా యూనివర్సిటీ మొదటి స్థానాన్ని ఉపేంద్ర ఉస్మానియా యూనివర్సిటీ రెండో స్థానాన్ని రంగస్వామి పి ఎస్ సి అండ్ కె వి ఎస్ సి గవర్నమెంట్ కాలేజ్ మూడవ స్థానాన్ని కనీసం చేసుకున్నారు.
పురుషుల జాబిలింతల యందు వెంకట శ్రీనాథ్ పి ఎస్ సి అండ్ కేవైసీ గవర్నమెంట్ కాలేజ్ మొదటి స్థానాన్ని ఎస్ షరీఫ్ అహ్మద్ పిఎస్ఎన్ఎల్ కాలేజ్ రెండో స్థానాన్ని గాబ్రియల్ ఆర్ యు కాలేజ్ మూడో స్థానాన్ని సాధించారు. అలాగే మహిళల 1500 మీటర్ల యందు ఈ ప్రసన్న పిఎస్ఎండికేవీఎస్ గవర్నమెంట్ కాలేజ్ మొదటి స్థానాన్ని మానస సెయింట్ జోసెఫ్ రెండవ స్థానాన్ని తేజస్విని సెయింట్ జోసెఫ్ మూడవ స్థానాన్ని సాధించారు అలాగే మహిళల షార్ట్ పట్ నందు కీర్తన పిఎస్సి అండ్ కె వి ఎస్ సి గవర్నమెంట్ కాలేజ్ మొదటి స్థానాన్ని అలాగే జయశ్రీ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే మహిళల డిస్కస్ త్రోయందు ప్రసన్న మొదటి స్థానాన్ని ప్రసన్న మహేష్వరి రెండు మూడు స్థానాలను ప్రవేశం చేసుకున్నారు అలాగే పురుషుల 1500 మీటర్ల యందు శివలింగప్ప బషీర్ మరియు ఉపేంద్రాలు మొదటి రెండో మూడో స్థానాలు సాధించారు అలాగే పురుషుల 400 మీటర్ల యందు పరశురాముడు సుదర్శన్ రంగస్వామిలు మొదటి రెండవ మూడో స్థానాలు సాధించారు
Arattai