ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం,రోటరీ ఇన్నర్ వీల్ సంయుక్త నిర్వహణ
వివిధ అంశాలపై ప్రసంగించిన మహిళా వైద్యులు నాగమణి, లక్ష్మీ సౌజన్య,సునీత, రాధిక,గీతా వాణి
భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ మహిళా వైద్య విభాగం, నంద్యాల రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ మహిళా విభాగం సంయుక్త నిర్వహణలో లైఫ్ మహిళా హెల్త్ క్లబ్ ప్రాంగణంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి అధ్యక్షతన రోటరీ ఇన్నర్ వీల్ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లీశ్వరి నిర్వహణలో జరిగిన ఈ సదస్సులో డాక్టర్ నాగమణి, డాక్టర్ సునీత మంచి ఆరోగ్యానికి జీవన శైలిలో మార్పుల గురించి, డాక్టర్ లక్ష్మీ సౌజన్య గర్భాశయ,అండాశయ క్యాన్సర్ పై, డాక్టర్ రాధిక గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, వ్యాక్సిన్ ఆవశ్యకత పై, డాక్టర్ గీతా వాణి రొమ్ము క్యాన్సర్,మామోగ్రామ్ అంశంపై సదస్సుకు హాజరైన మహిళలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ” సేవే స్ఫూర్తిగా, బాధ్యతే బాటగా” ప్రజా ఆరోగ్య అవగాహన సదస్సులు,శిబిరాలు,
ప్రత్యేకించి బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లీశ్వరి, సీనియర్ వైద్యులు డాక్టర్ నాగమణి,డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ,రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం కార్యదర్శులు డాక్టర్ శైలజ, డాక్టర్ సునీత, కోశాధికారి డాక్టర్ హరిత,డాక్టర్ రాధిక, డాక్టర్ గీతావాణి, ఇన్నర్ వీల్ మహిళా విభాగం ప్రతినిధులు గోళ్ల పద్మ, శైలజ, సుశీల పాల్గొన్నారు.
Arattai