NANDYAL Dec31:- సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మరియు అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షణలో CWSN(children with special needs)ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించారు.నంద్యాల కర్నూల్ జోన్ సంబంధించి 15 నుండి 18 సంవత్సరాలు వయసు గల CWSN విద్యార్థినీ విద్యార్థులకు పరుగు పందెం షార్ట్ పుట్ లాంగ్ జంప్ తదితర అంశముల యందు పోటీలను నిర్వహించారు.
నంద్యాల పట్టణం ఎస్పీజీ హై స్కూల్ క్రీడా మైదానం నందు బుధవారం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ శిక్షణకు CWSN(children with special needs) విద్యార్థుల ఎంపిక పోటీలు నిర్వహించారు.ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు.ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం,శారీరక సామర్థ్యం,సాహస గుణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి,APC నిత్యానందరాజులు, రాష్ట్రస్థాయి పరిశీలకులు శంకరయ్య, నంద్యాల జిల్లా సహిత విద్యా సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా సహిత విద్యా సమన్వయకర్త సురేంద్ర బాపూజీ ,నంద్యాల జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త ప్రసన్నకుమార్, అసిస్టెంట్ IE శ్రీనివాసులు ఎస్పీజీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మార్తమ్మ,SGF సెక్రెటరీ విశ్వనాధ్,IE ఉపాధ్యాయులు,IEDSS లు పాల్గొన్నారు
Arattai