NAARAVARI PALLI:- నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో కలిసి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకముందు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. పండితులు వేద ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆశీర్వదించారు.

అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులు ఖర్జుర నాయుడు, అమ్మణ్ణమ్మ, తమ్ముడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు.

ఇంటి ఆవరణలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి సీఎం నివాళులు అర్పించారు.


సీఎం నారావారిపల్లెలోనే ఉండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి వద్దకు వెళ్లి అర్జీలను అందుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.



Arattai