భవనాశి నాగ మహేష్ సౌజన్యంతో విద్యార్థులకు 120 బహుమతుల పంపిణీ
NANDYAL Jan 26 :- నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంజీవనగర్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల రావు అధ్యక్షతన జరిగిన వేడుకలలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు జాతీయ పతాకావిష్కరణ చేసి పతాక వందనం చేశారు.
రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు భవనాశి శ్రీరామ మూర్తి జ్ఞాపకార్థం భవనాశి నాగ మహేష్ సౌజన్యంతో 120 బహుమతులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తిరుమల రావు, బహుమతుల దాత భవనాశి నాగ మహేష్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు రవి ప్రకాష్, మహేశ్వర రెడ్డి, కశెట్టి చంద్రశేఖర్, పోసిన సుబ్బారావు,కూరా ప్రసాద్, మామిళ్ల నాగరాజు, కన్నయ్య, సందీప్, రామకృష్ణుడు,భవనాశి సాయి శ్రీ హిత్ పాల్గొన్నారు.
Arattai