NANDYAL Jan26:- సమాజంలో రక్తం కొరతతో ప్రాణాపాయం ఎదుర్కొనే రోగులకు ఆశాకిరణంగా రక్తదాన శిబిరాలు ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనిధి రఘువీర్ పేర్కొన్నారు

సోమవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు… ఈ సందర్భంగా సామాజిక బాధ్యతతో 26 మంది హోటల్స్ అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేయడం అభినందనీయమని రఘువీర్ తెలిపారు.. ముఖ్యఅతిథి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల దాతకు ఎలాంటి హాని ఉండదని ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు.

ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం వలన రక్తము అవసరమైన రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పలుమార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించిన రక్తదాత కిరణ్ మాట్లాడుతూ ప్రత్యేకించి తలసేమియాతో బాధపడే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు తాము సేకరించిన రక్తమును ఉచితంగా అందించాలని నంద్యాల బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు అచ్చు గారిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు హుస్సేన్ వలి, మస్తాన్ వలి, నంద్యాల హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు లింగారెడ్డి, గిరి, సుబ్రహ్మణ్యం, రవి, శివయ్య తదితరులు పాల్గొన్నారు..

Arattai