NANDYAL Jan26:- నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ శశికళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగం అందించిన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను ప్రతి విద్యార్థి తన జీవితంలో ఆచరించాలని ఆమె పిలుపునిచ్చారు.

విద్యార్థులు క్రమశిక్షణతో, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దబడుతూ దేశ అభివృద్ధికి తమ వంతు సేవ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించినటువంటి పోటీల యందు విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది అలాగే
కల్చరల్ ప్రోగ్రామ్ నందు విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది.ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని శ్రీ కె. శ్రీనివాసులు గారు సమన్వయం చేయగా, ఇందులో ఎన్సిసి యూనిట్ అలాగే క్లైమేట్ చేంజ్ యూనిట్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వేడుకల ముగింపులో విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.
Arattai