నెల్లూరులో రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ లో పాల్గొంటున్న గౌతమ్,నవీన్,ఇమ్రాన్, శ్రీనివాసులు
నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం తరపున క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందజేసిన డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య
NANDYAL Jan27:- నెల్లూరులో ఏ.సీ. సుబ్బారెడ్డి స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పారా స్పోర్ట్స్ ( దివ్యాంగ క్రీడలు) అథ్లెటిక్ పోటీలలో రుద్రవరం కు చెందిన గౌతమ్ ( జావలిన్, షాట్ పుట్), ఆత్మకూరు కు చెందిన ఇమ్రాన్ ( షాట్ పుట్, జావలిన్, లాంగ్ జంప్), వెంకటేశ్వరపురం కు చెందిన నవీన్ ( 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్), చిందుకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు ( డిస్కస్ త్రో, జావలిన్) నంద్యాల జిల్లా తరపున పాల్గొంటున్నారు. వీరు గతంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించడం జరిగింది.
నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం తరపున అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి ఎం.పి.వి.రమణయ్య వీరిని సత్కరించి 6 వేల రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో క్రీడలలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన క్రీడా పాలసీలో పారా స్పోర్ట్స్ లో వివిధ స్థాయిలలో సాధించిన విజయాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయిస్తున్నారని అన్నారు. నెల్లూరులో ఈ నలుగురు పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించడంతో పాటు నెల్లూరు లో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ మాఘం గౌతం సహకారంతో వసతి సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు.
దివ్యాంగులు క్రీడలలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసి ప్రోత్సహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, జిల్లా పారా స్పోర్ట్స్ కార్యదర్శి ఎం. పి.వి. రమణయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Arattai