NANDYAL Jan28:- నంద్యాల పట్టణం, టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు ఫిబ్రవరి2 తేదీ నుండి మూడు నెలలు పాటు ఆసన,ప్రాణాయామ,ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు యోగ గురువు దామోదర్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో మారిన జీవన పరిస్థితులు అనేక రకాల ఒత్తిడిల కారణంగా అనేక సమస్యలకు గురవుతున్నారని.అయితే ఈ విధంగా ఉన్నటువంటి శారీరక మానసిక సమస్యలు అన్నింటికీ కూడా యోగానే అద్భుతమైన పరిష్కారమని తెలిపారు.ప్రాణాయామం విశ్రాంతి పద్ధతులు,ధ్యానం పై చక్కని అవగాహన కల్పిస్తూ ఫిబ్రవరి 2వ తేదీ నుండి మూడు నెలలపాటు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.శ్వాసని మనం నియంత్రించగలిగితే మనసు ప్రశాంతం అవుతుందని,మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా చేకూరుతుందని తెలిపారు.ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.మరిన్ని వివరాలకు 89197 71823 అనే నెంబర్కు సంప్రదించాలని కోరారు
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai