NANDYAL:- అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి అంకితభావంతో సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులు,కవి,రచయిత, అరసం జిల్లా అధ్యక్షులు ముర్తుజా మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటని సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షులు యం.శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు.
ఆదివారం స్వర్గస్తులైన ముర్తుజా గారి పార్థివదేహాన్ని సాహితీ స్రవంతి సభ్యులు సందర్శించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ముర్తుజా తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపారని, అభ్యుదయ భావజాలానికి ముర్తుజా జీవితాంతం కట్టుబడి పనిచేశారని గుర్తు చేశారు.
సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డా.నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరసం ఉపాధ్యక్షుడిగా అనేక కార్యక్రమాల రూపకల్పనలో, నిర్వహణలో ముర్తుజా కీలకపాత్ర పోషించారన్నారు. మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ “కర్నూలు కవితా సంకలనం” తీసుకురావడంలో ముర్తుజా ప్రధాన భూమిక పోషించారన్నారు.
ఈ సందర్భంగా ముర్తుజా గారి కుటుంబ సభ్యులకు సాహితీ స్రవంతి రాష్ట్రనాయకులు కెంగార మోహన్ , జంధ్యాల రఘుబాబు, సభ్యులు శేషఫణి, నీలకంఠమాచారి, రఫీ, మాబుబాష,నరేంద్ర తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
Arattai