AMARAVATHI Feb 03:- • సమీక్షకు హాజరైన కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, సీఎస్ విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
• కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించి విశాఖ స్టీల్ ప్లాంట్.
ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్ కు క్రెడిట్ రేటింగ్ పెరిగినట్లు తెలిపిన అధికారులు.
• అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశ పెట్టి ప్లాంట్ ను మరింత బలోపేతం చేయాలని సూచించిన సీఎం
• కార్మికుల, ఉద్యోగుల సమర్థ వినియోగంతో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయ పడిన ముఖ్యమంత్రి
• యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వాలు కలిపి విశాఖ ఉక్కును విజయపథంలో నడపాలన్న సీఎం
• ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థలో అమలుచేసిన సంస్కరణలు, కార్మికుల సహకారంతో సాధించిన ఫలితాలను గుర్తు చేసిన సీఎం
• రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కుకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి ప్రస్తుతం లాభాల బాటపట్టిన ఆర్ఐఎన్ఎల్.

• హాట్ మెటల్ ప్రొడక్షన్ లో రోజుకు 19,401 టన్నుల ఉక్కు ఉత్పత్తి కి చేరుకున్న విశాఖ స్టీల్
• 2024-25 సెకండ్ క్వార్టర్ లో కేవలం రోజుకు 9,215 టన్నుల మాత్రమే ఉత్పత్తి చేసిన విశాఖ ఉక్కు
• మూడు బ్లాస్ట్ ఫర్నేస్ లు పనిచేస్తుండడంతో భారీగా పెరిగిన ఉత్పత్తి
• స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్ లో రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరుకున్న విశాఖ ఉక్కు
• 2024-25 సెకండ్ క్వార్టర్ లో కేవలం రోజుకు 45 శాతం మాత్రమే ఉత్పత్తి సామర్ధ్యం
• ఆర్దికంగా నష్టాల నుంచి లాభాల వైపు విశాఖ స్టీల్ ఉత్పత్తి
• 2024 సెప్టెంబర్ లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి..2026 జనవరిలో రూ.54 కోట్లు లాభం సాధించిన విశాఖ స్టీల్
• కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన రూ. 11 వేల కోట్ల సాయంతో నిలదొక్కుకున్న విశాఖ స్టీల్.
Arattai