నంద్యాల పట్టణంలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో సంకట సంకష్టహర చతుర్థి పూజలు యోగానంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.విగ్నేశ్వరునికి పంచామృతాభిషేకం, మోదకాలు, బెల్లం,గరికలతో అర్చనలు,విశేష పూజలు జరిగాయి

.సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే సంకటాలు, విఘ్నాలు తొలగి, కోరికలు తీరుతాయనే నమ్మకంతో భక్తులు ఉపవాసం పాటించి ప్రార్థనలు చేస్తారని వారు తెలిపారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు
Arattai