NANDYAL Feb10:- నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి చాప్లి పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి MNV రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎన్వి రాజు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వారు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణాలలోని ప్రతిభగల యువ క్రీడాకారులను గుర్తించి వారికి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం మరియు వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలీకితీయడం కోసం ప్రతినెల తేడా పోటీలు నిర్వహించడం కొరకు షాప్ లీక్స్ స్పోర్ట్స్ క్యాలెండర్ 2026 ను విడుదల చేసింది అని తెలిపారు.
ఈ లీగ్ పోటీలు సంవత్సరం పొడువున ప్రతినెల జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో 31 ప్రాధాన్యత గల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు ఈ క్రీడా పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అత్యుత్తమైన షాప్ క్రీడా శిక్షకులచే శిక్షణ ఇప్పించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించడం షాప్ లిగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు
ఈనెల 17వ తేదీన జిల్లాస్థాయి చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు ఈనెల 21 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు అలాగే ఈనెల 24వ తేదీన సైక్లింగ్ నందు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు ఈనెల 28 నుండి మార్చి ఒకటో తేదీ వరకు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.www.sports.ap.gov.in లో పేరు నమోదు చేసుకున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు.జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Arattai