NANDYAL Feb 19 :-నంద్యాల పట్టణంలో విభిన్న ప్రతిభావంతులకు జిల్లాస్థాయి రెండు రోజుల ఆర్ట్స్ & కల్చరల్ పోటీలు నిర్వహించినట్లు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు.

విద్యార్థులలో దాగివున్న సృజన పాటవాలను గుర్తించి తల్లితండ్రులు ఉపాధ్యాయులు వెలికి తీయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం నంద్యాల సెయింట్ జోసెఫ్ హైస్కూలు ఎందు ప్రత్యేక అవసరాల పిల్లల రెండు రోజుల జిల్లాస్థాయి ఆర్ట్ మరియు కల్చరల్ పోటీల భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం ప్రార్థనతో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అన్ని మండలాల నుంచి ప్రత్యేక అవసర గల పిల్లలలో వారి ప్రతిభను గుర్తించి ఇక్కడికి తీసుకొని వచ్చిన స్కూల్ అసిస్టెంట్లకు, భవిత సెంటర్ ఉపాధ్యాయులైన ఐ ఈ ఆర్పి లకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక అవసర గల పిల్లల తల్లిదండ్రులకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు ఇలాంటి పిల్లలకు ఎంతో ఓర్పుతో విద్య అందించడం దేవుడిచ్చిన వరం అన్నారు.

ఈ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువుతోపాటు, క్రీడలు, ఆర్ట్ తో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా డాన్స్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా తయారు చేయాలన్నారు. సాధారణ విద్యార్థుల కంటే ప్రత్యేక అవసరాలు ఒక్కొక్కరిలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుందని దానిని గుర్తించి వెలికితిస్తే ఆ విద్యార్థి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమానికి ఎ యం ఓ మాధవి లత, బనగానపల్లి మండల విద్యాధికారి స్వరూప రాణి, సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు న్యాయ నిర్ణతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల విద్యాధికారులు బ్రహ్మం నాయక్, శివరాం, జిల్లా ఐ ఈ సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి, అలెస్కో ప్రసన్న కుమార్, సహాయ సమన్వయకర్త శ్రీనివాసులు ఆయా మండలాల ఐ ఈ ఆర్టీలు, స్కూల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Arattai