NANDYAL Feb20 :-
కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ పథకం కింద అమలులో ఉన్న ప్రీ-వొకేషనల్ ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా గోస్పాడులోని ఏపి మోడల్ స్కూల్ కు చెందిన 6వ నుండి 8వ తరగతి విద్యార్థులు నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానంను శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అక్కడ నిర్వహిస్తున్న వివిధ పంటల పరిశోధనలు, కొత్త విత్తన రకాల అభివృద్ధి విధానాలు, సాగు పద్ధతులు మరియు భూసార పరీక్షల ప్రక్రియల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా వ్యవసాయోత్పత్తి పెంపు ఎలా సాధ్యమవుతుందో నిపుణులు వివరించారు.

ఆర్.ఏ.ఆర్.ఎస్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఏం. జాన్సన్ గారు, డా. ఏ.ఎం. రెడ్డి, డా. అరుణ్ కుమార్, డా. రమాదేవి గారు మరియు సిబ్బంది విద్యార్థులకు పరిశోధనల ప్రాముఖ్యత, వ్యవసాయ రంగంలో ఉన్న అవకాశాల గురించి అవగాహన కల్పించారు. భూసార పరీక్షల ద్వారా రైతులు పంటలకు అవసరమైన పోషకాలను ఎలా గుర్తించుకోవచ్చో ప్రదర్శన ద్వారా వివరించారు. విద్యార్థుల్లో వ్యవసాయ రంగంపై ఆసక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ప్రిన్సిపాల్ ఖాజా హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వొకేషనల్ ట్రైనర్లు నరేష్, ముక్తార్ హుస్సేన్, సమీన మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Arattai