NANDYAL Feb20:- నంద్యాల పట్టణంలోst జోసఫ్ హైస్కూల్లో విభిన్న ప్రతిభావంతులకు జిల్లాస్థాయి రెండు రోజుల ఆర్ట్స్ & కల్చరల్ పోటీలు శుక్రవారం ఘనంగా ముగిసినట్లు ఐ ఈ జిల్లా సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి తెలిపారు.విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్స్ లకు,పాడే పాటలకు, వారి వేసిన వివిధ వేషధారణలను చూసి తల్లితండ్రలు,ఉపాధ్యాయులు. సంతోషం వ్యక్తం చేశారు.పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటుచేసిన రాష్ట్ర సమగ్ర శిక్ష తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణతలుగా ఏ ఎం ఓ మాధవి లత , బనగానపల్లి మండల విద్యాధికారి స్వరూప, మరియు ప్రసన్నకుమార్ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఎంతో చక్కగా ఆనందంగా చేసిన నృత్యాలు, డాన్సులు ఎంతగానో అలరించాయి. వారు చేస్తున్నప్పుడు మిగతా పిల్లల కూడా వెనుక నుంచి చేస్తుంటే ఆ ప్రాంతమంతా ఎంతో ఆనందాన్ని మనసుకు సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో అలెస్కో ప్రసన్నకుమార్, జిల్లా సహాయ సమన్వయకర్త శ్రీనివాసులు, ఐఈఆర్టీలు మధుసూదన్ రెడ్డి, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Arattai