NANDYAL Feb 22 :- నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి డా.కొండూరు శ్రీదేవి రచించిన ‘వసంతసేన’ నవలను, శ్రీ కోడూరు శేషఫణిశర్మ రచించిన ‘ముద్దబంతి’ పుస్తకాలను సూరన సారస్వత సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలో ఘనంగా ఆవిష్కరించారు.

సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు అధ్యక్షతన డా.శ్రీదేవి స్వగృహంలో నిర్వహించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు సాహితీవేత్తలు,భాషాభిమానులు పాల్గొన్నారు. వసంతసేన నవలను డా.నీలం వెంకటేశ్వర్లు, ముద్దబంతి పద్యకవితా సంపుటిని కవి నీలకంఠమాచారి సమీక్షించారు.

పుస్తక రచయితలను సాహితీ ప్రియులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డా.చిట్టిబొట్ల మధుసూదనశర్మ,అన్నెం శ్రీనివాసరెడ్డి, పవన్ కుమా, కవులు నరసింహులు,రఫి,రోటరీ స్కూల్ కరస్పాండెంట్ డి.వి.సుబ్బయ్య, మహిళా సాహితీవేత్తలు వసుంధర,విజయలక్ష్మి,కృష్ణప్రియ,అన్నపూర్ణ, బసవేశ్వరి,లలితా సరస్వతి, లీలాకుమారి,మధు,ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
Arattai